15వేల ఉద్యోగాలిస్తాం: 50శాతం మహిళలకే | Sakshi
Sakshi News home page

15వేల ఉద్యోగాలిస్తాం: 50శాతం మహిళలకే

Published Thu, Dec 7 2017 7:52 PM

Ikea to employ 15,000 co-workers in India by 2025  - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ఫర్నీచర్‌ సంస్థ ఐకియా దేశీయ నిరుద్యోగులకు , ముఖ్యంగా మహిళలకు తీపి కబురు అందించింది.  రాబోయే ఏళ్లలో దేశంలో భారీగా ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతోంది. 2025 నాటికి ఐకియా గ్రూపు సంస్థల్లో 15వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది.  వీటిలో 50శాతం మహిళలే ఉంటారని తెలిపింది. 

2025 నాటికి భారతదేశంలో 15వేల మందిని ఎంపిక  చేసుకోనున్నామని స్వీడిష్ హోమ్ ఫర్నిషింగ్ రీటైలర్ ఐకియా తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో 400మందికిపైగా ఉద్యోగులుండగా, 2025 నాటికి  వీరి సంఖ్యను 15వేలకు పెంచుకోవాలనే  ప్రణాళిక వేసింది  ముఖ్యంగా  హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో(ఎన్‌సీఆర్‌ పరిధి) ప్రారంభించే స్టోర్ల కోసం ఒక్కో స్టోరుకు 500 నుంచి 700 మంది ఉద్యోగులను  ఎంపిక చేస్తామని  ఐకియా ఇండియా కంట్రీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అన్నా కెరిన్‌ మాన్సన్‌ చెప్పారు. వీరిలో సగంమంది మహిళా  అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని  వెల్లడించారు.  అంతేకాదు లాయల్టీ కింద తమ స్టోర్లలో పని చేసే ఉద్యోగుల్లో ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి పెన్షన్‌ ఖాతాకు అదనంగా రూ.1.5 లక్ష జమ చేస్తామని ఐకియా గ్రూపు  ప్రకటించడం విశేషం.

Advertisement
Advertisement